ఐదు నెలల పాటు ముహూర్తాల్లేవ్‌!

Telugu Lo Computer
0


కరోనా వైరస్‌ విజృంభణ తో గత ఏడాదిలో సగానికిపైగా వివాహ శుభకార్యాలు రద్ద య్యాయి. ఆ సంవత్సరం మొత్తానికి 56 రోజుల్లో వున్న ము హూర్తాల్లోనే పెళ్లిళ్లు జరిగాయి. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో పరిస్థితులు బాగుంటాయని ఆశించిన వారికి నిరాశే మిగలనుంది. ఈ ఏడాదిలో జనవరి, జూలై, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల్లో ముహూర్తాలు లేవు. జనవరి నెలాఖరు వరకు శూన్యమాసం. ఫిబ్రవరి 2 నుంచి 20వ తేదీ మధ్య 12 రోజులు ముహూర్తాలు ఉండగా, ఆనెల 21 నుంచి గురు మౌడ్యమి ప్రారంభమై మార్చి 18తో ముగియనుంది. తర్వాత ఆ నెలలో ఆరు రోజులతోపాటు, ఏప్రిల్‌లో 13, మేలో 11, జూన్‌లో 13 రోజులు ముహూర్తాలున్నాయి. ఆషాఢం కారణంగా జూలైలో ముహూర్తాలు కరువు. ఆగస్టులో పది రోజులే ఉన్నాయి. భాద్రపదం, శుక్ర మౌడ్యమి తదితర కారణాలతో మూడు నెలలపాటు శుభ కార్యాక్రమాలు జరగవు. డిసెంబరు 2 నుంచి 18వ వరకు పది రోజులు ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి సంక్రాంతి నెల ప్రారంభం అవుతుంది. కరోనా కొత్త వేరియం ట్‌ ఒమైక్రాన్‌ ప్రబలితే ఈ శుభాకార్యాలు కూడా  జరగకపోవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)