నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 4 January 2022

నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్


రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నానికి జోడీగా కృతి శెట్టి - సాయిపల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ లో  మడోన్నా సెబాస్టియన్ లాయర్ పాత్రలో కనిపించి అదరగొట్టింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్యామ్‌సింగరాయ్‌ ను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చింది. శ్యాం సింగరాయ్ సినిమా మాత్రం తొలిరోజు నుంచే అదిరిపోయే హిట్ టాక్ తెచ్చుకుంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని నటన. సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, రాహుల్ డైరెక్షన్, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఈ సినిమాలో నటించిన విలన్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఎత్తు ఆ లుక్ ఆ కోపం దేవదాసిలను పెట్టే చిత్రహింసలు..ఇవన్నీ చూస్తుంటే ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్ధమౌతుంది. ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆయన పేరు మనీష్ వాద్వా. మనీష్ మొదటగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి..ఆ తరువాత సీరియల్ ల్లో నటించి ఆ తరువాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో తనదైన స్టైల్లో మెప్పించి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై కన్నేశాడు. ఇప్పుడు ఈయన చేతిలో రెండు బడా సినిమాలు ఉండడం గమనార్హం.


No comments:

Post a Comment