ఆఫ్రికా దేశాల్లో చైనా భారీ పెట్టుబడులు ?

Telugu Lo Computer
0


చీకటి ఖండంమైన ఆఫ్రికాలో చైనా బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను తమవైపు తిప్పుకుంటోంది. కెన్యా లోని స్టార్ టైమ్స్‌లో మీడియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. అక్కడి మీడియాను వినియోగించుకొని చైనా తన ప్రాజెక్టులను గురించి ప్రచారం చేసుకుంటోంది. ఈ స్టార్ టైమ్స్ శాటిలైట్ ప్యాకేజీని అత్యంత చౌకగా అందిస్తున్నది. దాదాపు ఆఫ్రికాలోని 30 దేశాల్లో 2.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆఫ్రికాతో పాటు అటు ఇటలీ మీడియాలోనూ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇటలీ అధికార మీడియా ఏఎన్ఎస్ఏ తో చైనాకు చెందిన జిన్హువా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ 50 చైనా అనుకూల కథనాలను ఇటలీ మీడియా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సెర్బియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా చైనా పెట్టుబడులు పెట్టింది. కరోనా సమయంలో చైనా తనకున్న మీడియా బలంతో కరోనా మహమ్మారి పుట్టింది చైనాలో కాదని, ఇటలీలో అని చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే ప్రపంచం మొత్తం ఈ వైరస్ చైనా నుంచే వచ్చినట్టు ప్రచారం కావడంతో చైనా చేసిన కృషి ఫలించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)