అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను !

Telugu Lo Computer
0


ఒకవైపు అమెరికాను కరోనాతో పాటు మరో సమస్య వణికిస్తున్నది. గత కొన్నిరోజులుగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మంచు తుఫాను కురుస్తున్నది. మంచుతోపాటు వేగంగా గాలులు వీస్తుండటంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. దీనిని నార్ ఈస్టర్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి మరింత దిగజారి పీడనం పడిపోతే మంచు గట్టలు గుట్టలుగా పడిపోతుంది. దీనిని బాంబ్ సైక్లోన్ అని పిలుస్తారు. ప్రస్తుతం అమెరికాలోని అనేక ప్రాంతాలను ఈ బాంబ్ సైక్లోన్ అతలాకుతలం చేస్తున్నది. మంచు అడుగులమేర పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్ సహా అనేక రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని హెచ్చరించారు. బాంబ్ సైక్లోన్ కారణంగా మంచు పేరుకుపోవడంతో రోడ్లన్ని మంచుతో నిండిపోయాయి. వాహనాలు మంచులో కూరుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బాంబ్ సైక్లోన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.


Post a Comment

0Comments

Post a Comment (0)