హిందీలో వంద కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప!

Telugu Lo Computer
0


పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీతో ఈ డైలాగ్ చెప్పించాడో కానీ బన్నీ లైఫ్ టర్న్ అయిపొయింది. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. ఉత్తరాదిన బన్నీని స్పెషల్ స్టార్ ను చేసేసింది. దక్షణాది అన్ని బాషల కంటే హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. పుష్ప ది రైజ్ నార్త్ లో భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఒకటిన్నర నెల రోజుల తర్వాత కూడా నార్త్ లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఒకపక్క హిందీ మినహా మిగతా బాషలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చినా థియేటర్లలో కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. హిందీలో తాజాగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించింది. ఊహించని విధంగా బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఈ తరహా రెస్పాన్స్ రావడం సెన్సేషన్ కాగా.. ఒకే ఒక్క సినిమా అతన్ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)