చిరంజీవికి కరోనా పాజిటివ్

Telugu Lo Computer
0


మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డట్టు  చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు మెగాస్టార్. కొన్ని రోజులుగా షూటింగ్స్ కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయారు. మధ్యలో కొన్నిసార్లు మాత్రం బయట ఏదైనా ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించినపుడు మాత్రం వెళ్లి వస్తున్నారు. దాంతో పాటు ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు అంతా కలిసే ఉంటున్నారు. దర్శక నిర్మాతలతో పాటు కొందరు సినీ ప్రముఖులు చిరంజీవిని నిత్యం ఇంటి దగ్గర కలుస్తూనే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)