క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ....!

Telugu Lo Computer
0


కూరగాయల్లో క్యారెట్ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ, తరచూ క్యారెట్లు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా? కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడేవారు క్యారెట్లు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు క్యారెట్లు తినడం వల్ల ప్రయోజనం కంటే హానీ ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. క్యారెట్ తిన్న తర్వాత కొంత మంది అలెర్జీల బారిన పడుతున్నారు. నిజానికి, క్యారెట్ తినడం వల్ల కొందరిలో దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. చర్మ సమస్యలతో పాటు అతిసారం బారిన పడవచ్చు. క్యారెట్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ఎ గా మారుతుంది. క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో కెరోటిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది కెరోటినిమియాకు కారణమవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత చర్మం పసుపు రంగులోకి మారుతుంది. క్యారెట్‌లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. క్యారెట్‌లోని చక్కెర గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. పాలిచ్చే మహిళలు, గర్భిణిలు క్యారెట్లు తినడం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏది తిన్నా అది మీ బిడ్డకు చేరుతుంది. క్యారెట్లు తల్లి పాల రుచిని మారుస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు పెద్ద మొత్తంలో క్యారెట్ జ్యూస్ తాగకుండా ఉండాలి. కొన్ని నివేదికల ప్రకారం చిన్న పిల్లలకు క్యారెట్లు సురక్షితం కాదు. అందువల్ల, క్యారెట్లు చిన్న పిల్లలకు చాలా అరుదుగా ఇవ్వాలి. కాబట్టిచిన్న పిల్లలకు క్యారెట్లు తక్కువ మోతాదులో ఇవ్వాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)