గర్భిణీ స్త్రీలు తొమ్మిది నెలలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించి బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరు. అయితే చాలా మంది నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. గర్భిణీలు ఎక్కువ తియ్యటి ఆహార పదార్థాలను కానీ కారంగా ఉండే ఆహార పదార్థాలను కానీ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకొద్దు. చాక్లెట్స్, పిజ్జా వంటి వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వాటికి దూరంగా వుండి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలా మంది గర్భిణీలు 9 నెలలు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత యాక్టివ్ గా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ బరువులు ఎత్తడం వంటిది మంచిది కాదు. ఒత్తిడి లేకుండా ఉండడం, పాజిటివ్ ఆలోచనలతో ఉండడం, మంచి పుస్తకాలను చదవడం, మ్యూజిక్ వినడం వంటివి చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. కనుక ఈ విధంగా గర్భిణీలు తొమ్మిది నెలల ఫాలో అయితే కచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలుంటాయి.
నార్మల్ డెలివరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
January 07, 2022
0
Tags