అందాన్ని ఎరగా వేసి...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 7 January 2022

అందాన్ని ఎరగా వేసి...!


ఆమెకు అందంతో పాటు అమోఘమైన తెలివితేటలు. 19 ఏళ్లకే స్టార్టప్ రంగంలో సంచలనం. 30 ఏళ్ల వయసుకే బిలియనీర్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో పేరు. కానీ ఆ హవా ఎంతో కాలం నిలవలేదు. ఆమె చేసిన మోసం బట్టబయలైంది. అందంతో పెట్టుబడి దారులను ఆకర్షించే మంత్రం ఇక పని చేయలేదు. డయాగ్నోస్టిక్ ఫీల్డ్‌లో సరికొత్త విప్లవానికి తెరలేపిన ఎలిజబెత్ హోమ్స్‌ని ప్రపంచమంతా పొగడ్తలతో ముంచెత్తింది. ఆమె విజన్ మేధావుల్ని ఆకర్షించింది. బడా బడా కంపెనీలో ఆమె ఆవిష్కరణలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టారు. కానీ ఒక్కసారిగా వ్యతిరేకత.. ఆమె చేసిన మోసాలన్నీ ఫ్రూఫ్‌లతో సహా బయటపడ్డాయి. కేవలం ఒకే ఒక్క రక్తపు చుక్కతో బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషిన్లను 'థెరానోస్' ను రూపొందించింది. అనతికాలంలోనే ఆ స్టార్టప్ కాస్తా హెల్త్ టెక్నాలజీ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. బడా బడా కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఆమె అందంతో పాటు స్వీట్ వాయిస్‌కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి కారణమైంది. కానీ కంపెనీలోని లొసుగులు బయటపడడంతో ఎలిజబెత్ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. మొత్తం 11 అభియోగాలు ఆమెకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. 11 వారాల ప్రాసిక్యూషన్, 24 మంది ప్రత్యక్ష సాక్షులతో విచారణ జరిగింది. 37 ఏళ్ల ఎలిజబెత్ బయోటెక్ స్టార్ నుంచి మోసగత్తే అనే ట్యాగ్ తగిలించుకుని కటకటాల వైపుకు అడుగులు వేస్తోంది. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే ఆమె ఎంత మాటకారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్నేళ్లపాటు ఆమె బిజినెస్ ఎలా సాగించిందన్నదే ప్రశ్న..


No comments:

Post a Comment