కరోనా టాబ్లెట్ మోల్నుపిరావిర్‌ వచ్చేసింది ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 1 January 2022

కరోనా టాబ్లెట్ మోల్నుపిరావిర్‌ వచ్చేసింది !


కరోనా సోకినవారికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్‌ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మెడిసిన్ మొదటిసారిగా హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ మెడిసిన్ కరోనాను ఐదు రోజుల్లో కట్టడి చేయగలుగుతుందని చెబుతున్న ఈ మోల్నుపిరావిర్‌ భారత్ లో ముందుగా హైదరాబాద్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇవి 40 ట్యాబ్లెట్స్ సుమారు రూ.2,000 నుంచి రూ.2,500ల ధరను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా భారత్ లో కోవిడ్-19 చికిత్స కోసం మోల్నుపిరావిర్ ను విడుదల చేసింది.80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వయోజన రోగుల కోసం మోల్నుపిరావిర్‌ను ఆమోదించింది. ఈ మెడిసిన్ కు షరతులతో కూడిన ఆమోదం లభించింది. ఇటీవల ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు రోగి మరణ ప్రమాదం ఉన్నట్లయితేనే ఈ మోల్నుపిరావిర్ ఇవ్వాలని క్లినికల్ డేటా యొక్క సమీక్ష తర్వాత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనార్హం. మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన 13 కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్‌ సంస్థ మోల్‌కోవిర్‌ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని గురువారం  హైదరాబాద్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించింది.

No comments:

Post a Comment