అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా కేసులు..!

Telugu Lo Computer
0


అమెరికాలో కరోనా విశ్వరూపం దాల్చింది. మహమ్మారి తీవ్రతతో అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఒకే రోజు 14,49,005 మందికి వైరస్‌ సోకింది. వారం రోజుల సగటును పరిశీలిస్తే అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి మందగించిందనే సంకేతాలు ఉన్నా.. డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తూ భయపెడుతోంది. అమెరికాలో సోమవారం కనీసం 1.13 మిలియన్‌ కొత్త కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. గతంలో 1.03 పాజిటివ్‌ కేసులే అత్యధికగా రికార్డుకాగా, ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్ధలు కొడుతూ.. ఏకంగా ఒక్క రోజే 1.13 కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 21,041,50 కేసులు..! ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 21,041,50 మంది వైరస్‌ బారినపడ్డారు. 4,608 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955 కు చేరాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)