భారీగా మీసాలు పెంచి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 January 2022

భారీగా మీసాలు పెంచి సస్పెండ్ అయిన కానిస్టేబుల్


ఓ పోలీసు కానిస్టేబుల్ భారీగా తన మీసాల్ని పెంచాడు. ఆ మీసాలు ఆయన మెడ వెనుక వరకు పెరిగాయి. దాంతో ఉన్నతాధికారులు ఆ మీసాల్ని ట్రిమ్ చేయాలని చెప్పడంతో అందుకు పోలీస్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా కుదరదని తేల్చి చెప్పాడు. అంతేకాదు మీసాల్ని పెంచడం తమ ఇంటి సంప్రదాయం, ఆత్మగౌరవం అని చెప్పాడు. దాంతో ఉన్నతాధికారులు రాకేశ్ ని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.  ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు, విధి నిర్వహణ విషయంలోనూ తన కమిట్ మెంట్ ను ఇరు వర్గాల వారు మరోసారి ప్రదర్శించారు. తనని సస్పెండ్ చేసినా సరే.. తాను మాత్రం మీసాల్ని ట్రిమ్ చేసేది లేదని స్పష్టం చేశాడు. ఉద్యోగపరంగా తన మీద ఎలాంటి ఫిర్యాదులు లేవని.. మీసాలు ఉండటం తనకు గర్వకారణం అన్నాడు. కాగా రాకేశ్ ఉదంతం అన్నిమీడియాలో ప్రముఖంగా రావటంతో అతడి మాటలకు పలువురు ఫిదా అయ్యారు. అదే సమయంలో మీసాల్ని భారీగా పెంచేసిన ఈ పోలీసు ఉద్యోగి మైండ్ సెట్ ఏమిటన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టతకు వచ్చింది. అంతేకాదు.. అతన్ని పిలిపించుకొని.. అతనిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. అతనిపై విడుదల చేసిన ఉత్వర్తులను వెనక్కి తీసుకున్నారు. దీంతో.. రాకేశ్ రాణా మళ్లీ పోలీస్ శాఖలోని మోటార్ వెహికల్ విభాగపు డ్రైవర్ గా విధుల్లో చేరారు.

No comments:

Post a Comment