రూ.634లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 5 January 2022

రూ.634లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్!


దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే రూ.900లకు పైగా పెరిగిన పోయిన గ్యాస్ ధరలతో సామాన్యుడికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండేన్ గ్యాస్ సంస్థ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ప్రత్యేకమైన ఆఫర్ తో ముందుకొచ్చింది. కేవలం రూ.633.5 ధరకే ఎల్పీజీ సిలిండర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది సాధారణ సిలిండర్ కాదు.. మామూలు సిలిండర్ కంటే కొంచెం తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్. దీనిపై ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. మిగిలిన గ్యాస్ సిలిండర్ల లాగా ఇది తుప్పు పట్టదు. సాధారణ ఎల్పీజీ సిలిండర్ కోసం దాదాపుగా రూ.900లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ కాంపోజిట్ సిలిండర్ కోసం కేవలం రూ.633.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ సిలిండర్ లో గ్యాస్ 10 కిలోలు ఉంటుంది. ఈ కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేక ఏమిటంటే, దీన్ని సులభంగా తీసుకెళ్లొచ్చు. తక్కువ మంది ఉన్నకుటుంబంలో ఈ గ్యాస్ సిలిండర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్ బరువు దాదాపు 15 కిలోలు, ఇది ప్రస్తుతం ఉన్న స్టీల్ డొమెస్టిక్ సిలిండర్‌లో దాదాపు సగం బరువుండేది. 10 కిలోల గ్యాస్ నింపిన తర్వాత, ఈ కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ మొత్తం బరువు 15 కిలోలు అవుతుంది. మహిళలు, వృద్ధులు.. ఈ కాంపోజిట్ సిలిండర్లను ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ రెండు రకాలు, ఒకటి 10 కిలోలు, మరొకటి 5 కిలోలు అందుబాటులో ఉంటుంది. 10 కిలోల గ్యాస్ తో కూడిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ ముంబయిలో రూ.634, కోల్ కతాలో రూ.652, చెన్నైలో రూ.645, లక్నోలో రూ.660కి విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఇండోర్‌లో రూ.653, భోపాల్‌లో రూ.638, గోరఖ్‌పూర్‌లో రూ.677, పాట్నాలో దాదాపు రూ.697గా ఉంది. ప్రస్తుతం ఇది దేశంలోని 28 నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లోనూ అందుబాటులోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ సంస్థ పేర్కొంది.

No comments:

Post a Comment