బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్

Telugu Lo Computer
0


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈనెల 17 వరకు బండి సంజయ్ తో పాటు కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీశ్ లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది, మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లోతెలిపారు. 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ ఆదివారంరాత్రి కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కోవిడ్ నిబంధనలు అమలవుతున్న కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నోటీసు జారీ చేసినా వినలేదు. దీంతో నిన్న రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దాదాపు మూడు గంటల హై డ్రామా మధ్య బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం బండి సంజయ్ ను కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్ధానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన నేతలు సమావేశం అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బండి సంజయ్ పై గతంలో ఉన్న పాత కేసులను, ఐపీసీ సెక్షన్ 333 ను పెట్టటాన్ని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. బండి సంజయ్ కు పూర్తి మద్దతు ఇస్తామని పార్టీ జాతీయ అధ్యుక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బండి చేస్తున్న దీక్షను మెచ్చుకున్నారు. కేసుల గురించి మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. శాంతి యుతంగా తన కార్యాలయంలో దీక్షచేస్తున్న బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం… కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయటాన్ని నడ్డా ఖండించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)