డేట్లు కుదరక ఆర్.ఆర్.ఆర్ లో నటించలేదు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

డేట్లు కుదరక ఆర్.ఆర్.ఆర్ లో నటించలేదు!


ప్రముఖ దర్శకుడు "సుకుమార్" దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలో హీరో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పలత కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి కల్పలత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది. అలాగే మరిన్ని చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించినప్పటికీ ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. కానీ ఇటీవలే విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో పాటు పుష్ప చిత్రంలో నటి కల్పలత పాత్రకి కొంతమేర స్కోప్ ఉండటంతో ప్రస్తుతం కల్పలత కి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా సినిమా అవకాశాలు కూడా బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా నటి కల్పలత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పుష్ప చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం దర్శకుడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కష్టపడి పని చేశారని చెప్పుకొచ్చింది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రతి ఒక్కరితో చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తాడని అంతేకాకుండా తన పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంత కష్టపడి పని చేయడానికైనా సిద్ధపడతాడని అందువల్లనే గొప్ప స్థాయిలో ఉన్నాడని పేర్కొంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో తన తదుపరి అవకాశాల గురించి స్పందిస్తూ తనకి ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలిపింది. అయితే ఆ మధ్య తనకి తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ తాను ఇతర చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో డేట్లు కుదరలేదని దాంతో దర్శకుడు రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయినందుకు తాను ఇప్పటికీ చాలా బాధపడుతున్నానని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం తాను తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ" దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నానని తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి కల్పలత ఆ మధ్య తెలుగులో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో కూడా నర్స్ పాత్రలో కనిపించి బాగానే ఆకట్టుకుంది. దీంతో అప్పటి నుంచి నటి కల్పలత కి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

No comments:

Post a Comment