వైష్ణో దేవి ఆలయం తొక్కిసలాటలో 12 మంది మృతి

Telugu Lo Computer
0


కొత్త సంవత్సరం రోజు మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 12 మంది భక్తులు మృతి చెందినట్లుగా జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 20 మందివరకు గాయపడి ఉంటారని ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని నరైనా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆలయ తొక్కిసలాట ఘటనపై  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ మనోజ్ సిన్హా మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)