రుచికరమైన సుర్జాకా దాల్‌

Telugu Lo Computer
0


ఆకుపచ్చని ఆకులో పసుపు పచ్చని పెసరపప్పుతో పొగలు కక్కే ఈ అల్పాహారం అంటే హరిద్వార్‌ ప్రజలకు చాలా ఇష్టం. అందుకోసం అక్కడికి వచ్చి బారులు తీరతారు. దాన్ని చేసేది ఓ అరవై ఏళ్ల పెద్దాయన. పప్పు పలుకులుగా, ముద్దగా ఇలా పెసరపప్పును వెరైటీగా వండి పెద్ద ఇత్తడి పాత్రలో మోసుకు వచ్చి భోజనప్రియులకు కొత్త రకం రుచిని అందిస్తున్నారాయన. హరిద్వార్‌కు చెందిన ఈ వ్యక్తి కొన్ని ఏళ్లుగా 'సుర్జా కా దాల్‌'గా పిలిచే ఈ అల్పాహారాన్ని కేవలం పది, ఇరవై రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. ఇతన్ని అందరూ సుర్జా కా దాల్‌ అంకుల్‌ అని అభిమానంగా పిలుస్తారు. ఇలా ప్రత్యేకంగా వండిన పప్పు మిశ్రమాన్ని పచ్చని ఆకులో వేసి కారం, ప్రత్యేకమైన గరంమసాలా, ఉప్పు, చింతపండు గుజ్జు, నిమ్మరసం కలిపి అందిస్తున్నారు. ఉదయం ఏడు నుంచి 12 గంటల వరకు అమ్ముతారు. ఈ రుచి కోసం జనం రోజూ బారులు తీరుతారట. దీన్ని తనే స్వయంగా తయారుచేస్తారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)