కోపంతో ఊగిపోయిన బౌలర్‌ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 December 2021

కోపంతో ఊగిపోయిన బౌలర్‌ !


పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికరఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ సమయంలో పాకిస్తాన్‌ బౌలర్‌ మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ తన స్టైల్లో ప్రతీకారం తీర్చుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్‌ పవర్‌ప్లేలో బౌండరీలు, సిక్సర్ల మోత మోగిస్తూ దాటిగా ఆడుతుంది. తొలి పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌ను మహ్మద్‌ వసీమ్‌ వేశాడు. ఓవర్‌ ఐదో బంతిని 43 పరుగులతో దూకుడుగా ఆడుతున్న బ్రాండన్‌ స్టార్క్‌ వెనక్కి జరిగి స్క్వేర్‌లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ కొట్టాడు. అతని దెబ్బకు బంతి వెళ్లి రూఫ్‌టాప్‌ మీద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన మహ్మద్‌ వసీమ్‌ తర్వాతి బంతికే దెబ్బకు దెబ్బ తీశాడు. ఓవర్‌ చివరి బంతిని వసీమ్‌ గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. బ్రాండన్‌ కింగ్‌ వెనక్కి జరిగి షాట్‌ ఆడాలనుకున్నాడు. కానీ బంతి మిస్‌ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో వసీమ్‌ తన స్టైల్లో వెళ్లు.. పెవిలియన్‌ వెళ్లు.. అంటూ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్‌ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక మహ్మద్‌ వసీమ్‌ ఈ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ పూరన్‌, బ్రూక్స్‌, బ్రాండన్‌ కింగ్‌ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌(87), బాబర్‌(79) అజమ్‌లు చెలరేగడంతో 18.5 ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. కరోనా కారణంగా శనివారం నుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను జూన్‌ 2022లో నిర్వహించాలని ఇరు బోర్డులు ఒక అంగీకారానికి వచ్చాయి.

No comments:

Post a Comment