హిందీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎన్టీఆర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 December 2021

హిందీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎన్టీఆర్


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, రాజమౌళి, అలియాభట్ తదితరులు ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై లో జరిగిన చిత్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ తన హిందీ అందరి దృష్టిని ఆకర్షించారు. అక్షరం పొల్లు పోకుండా హిందీ లో అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా అజయ్ దేవగణ్ డైలాగ్ ను ఎన్టీఆర్ చెప్పి అందరినీ ఇంప్రెస్ చేశారు. తాజా సమాచారం ప్రకారం తన పాత్రకి కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అడిక్షన్ తో ఎన్టీఆర్ కూడా నార్త్ అభిమానులను కూడా ఇంప్రెస్ చేయనున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. నిజానికి రాజమౌళి స్వయంగా ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పమని తారక్ ను కోరారట. ఇక మరోవైపు భారీ అంచనాల మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాలుగవ సినిమా ఇది

No comments:

Post a Comment