ఆంధ్రప్రదేశ్ లో తగ్గనున్న మద్యం ధరలు

Telugu Lo Computer
0


మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ లో మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇక మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యమని, వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మద్యం ధర, ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం 37 శాతం తగ్గిందని పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)