ఆత్మహత్యకు పాల్పడిన మహిళా లెక్చరర్

Telugu Lo Computer
0


తెలంగాణ లోని  భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో సాంఘిక సంక్షేమ కళాశాలలో పనిచేస్తున్న ఇన్ చార్జి అదే కాలేజీలో పని చేస్తున్న ఓ మహిళా లెక్చరర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు విద్యార్థులంతా రీడింగ్ అవర్ లో ఉండగా వీరిద్దరు పక్క గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. ఇంతలో ఈ విషయాన్ని మరో ఉపాధ్యాయుడు గమనించి వీడియో తీశాడు. ఇదేం పనంటూ నిలదీశాడు. దీంతో వీడియో కారణంగా తన పరువు అంతా పోతుందని భావించిన ఆ మహిళా లెక్చరర్ తన రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన యువతి. కొంత కాలంగా తీవ్రమైన లైంగిక వేధింపుల వల్లే ఆమె ఒకరికి బలవంతంగా దగ్గర కావాల్సి వచ్చినట్టు.. దీనిని ఓర్వలేని మరొక ఉపాధ్యాయుడు ఆమెను టార్గెట్‌ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)