నాకు యాక్షన్‌ సినిమాలు చేయాలని ఉంది - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 December 2021

నాకు యాక్షన్‌ సినిమాలు చేయాలని ఉంది


నానికి జోడీగా  కృతిశెట్టి నటించిన 'శ్యామ్‌సింగరాయ్‌ ఇటీవల విడుదలైంది. సినిమాలో తన నటనకు వస్తున్న ప్రశంసలు, కెరీర్‌ గురించి కృతిశెట్టి మాట్లాడుతూ... నేను ఏ పాత్ర పోషించినా దాని తాలూకు సహజ స్వభావం, లక్షణాలు, అలవాట్ల గురించి వివరంగా నోట్స్‌ రాసుకుంటాను. కీర్తిపాత్రకు సంబంధించి రాసుకున్న నోట్స్‌ చాలా ఉపయోగపడింది. నా పాత్ర కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పాను. పొగ తాగడం నాకిష్టం ఉండదు. కానీ ఈ సినిమాలో నేను సిగరెట్‌ తాగే సన్నివేశాలు ఉన్నాయి. నేను చేయనంటే డైరెక్టర్‌ పొగాకు లేని సిగరెట్లు తెచ్చారు. మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసి సిగరెట్‌ తాగే సన్నివేశాలు చేశాను. శృంగార సన్నివేశాల్లో నటించడాన్ని తప్పుగా అనుకుంటారు. కానీ దాన్ని మేం వృత్తిపరంగానే చూస్తాం. యాక్షన్‌ సన్నివేశాలు చేసినట్టే శృంగార సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథతో ముడిపడి ఉంటేనే అలాంటి సన్నివేశాలు చేస్తాను. నాకు యాక్షన్‌ సినిమాలు చేయాలని ఉంది. సుకుమార్‌ సినిమాలో నటించాలనుంది.

No comments:

Post a Comment