ఒకే రోజు పదిసార్లు కొవిడ్ టీకా తీసుకున్నాడు...!

Telugu Lo Computer
0


కరోనాకు టీకాలు వచ్చినప్పటి నుంచి చాలా చిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇది వేసుకోబోమంటూ నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఇంకొందరు అయితే ఫస్ట్ డోస్ తీసుకుని రెండో డోస్ వద్దంటూ పారిపోతున్నారు. ఇలా అనేకమైన ఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కాకపోతే ఇది మరింత భయాందోళలనకు గురి చేసే అంశం. సాధారణంగా ఒక టీకా తీసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నెలల దాకా రెండో డోస్ తీసుకోవడానికి వీలుండదు. కానీ అక్కడక్కడా నర్సులు పొరపాటున ఒకేసారి రెండు టీకాలు ఇస్తుండటం మనం చూస్తున్నాం. ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తి ఒకేరోజు ఏకంగా పదిసార్లు టీకా తీసుకున్నాడు. న్యూజిలాండ్ దేశంలో ఉండే వ్యక్తి ఇలా ఒకేరోజు 10 సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం సంచలనం రేపుతోంది. అయితే ఇది నిజమేనా లేక అబద్ధమా అని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులను ఉపయోగించి ఒకేరోజు 10 సార్లు టీకా తీసుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఒకే రోజు ఇన్ని సార్లు టీకా తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదని, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక అతను తమకు ఇప్పటి వరకు చిక్కలేదని, కానీ అతను వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటూ కోరుతున్నారు. ఇక అతను డాక్టర్లు సూచించిన మందులను వాడాలని తెలుపుతున్నారు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ లో 12,500 కేసులు రికార్డు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)