హైదరాబాద్ నగరంలో చలి పులి...!

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో చలికి వణికిపోతుంది. ఒక్కసారిగా నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉండనున్నట్టు వాతరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలో కనీస ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు అయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. మరో నాలుగు అయిదు రోజుల వరకు ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉండదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదు అయినట్టు తెలిపింది..ఇక నగరంలోని సంగారెడ్డిలో 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో అది గత 10 ఏళ్ల కంటే అత్యల్పంగా నమోదు అయింది. దీంతో వాతావరణ శాఖ డిసెంబర్ 21 వరకు నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే.. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలకు వచ్చే కొన్ని రోజుల వరకు ఆరెంజ్ వార్నింగ్‌ను వాతావారణ శాఖ జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)