బంగార్రాజు టైటిల్ సాంగ్ రిలీజ్‌

Telugu Lo Computer
0


బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. "బంగార్రాజు" అంటూ సాగే.. పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక పాటలో.. ఫరియా అబ్దుల్లా, నాగ చైతన్య తమ స్టెప్పులతో ఇరగదీశారు. అటు శేఖర్ మాస్టర్ చేయించిన స్టెప్పులు సినిమాకే హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మాస్ సాంగ్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)