రేపు తెలంగాణలో ఇంటర్ కాలేజీల బంద్

Telugu Lo Computer
0


తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదం రేపుతున్నాయి. ఇంటర్ బోర్డు వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఎన్ఎస్ యుఐ ప్రకటించింది. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల బలైన విద్యార్థుల కోసం తాము పోరాడుతుంటే ఇంటర్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసుల చేత తమను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని ఎన్ఎస్ యుఐ  పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆరోపించారు. ఇంటర్ ఫలితాలపై అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని కొమ్ము అభిలాష్ అభిప్రాయపడ్డారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. ఇప్పటికైనా బోర్డు అధికారులు స్పందించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో చాలా మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టులో హైయ్యస్ట్ మార్కులు.. మరో సబ్జెక్టులో లోయస్ట్ మార్కులు రావడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.


Post a Comment

0Comments

Post a Comment (0)