ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. రాజకీయంగా గెలుపు ఓటముల్లో సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. అందునా గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించుకుంటేనే అధికారం దక్కేది. కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభవం కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ, కొంత కాలం క్రితం నాయకత్వం నుంచి తప్పుకున్నారు. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుని వద్ద జరిగిన సమావేశం, రైలు దగ్ధం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో..2019 ఎన్నికల ముందు కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5 శాతం రిజర్వేషన్లను కాపు సామాజికవర్గానికి కేటాయించి..మిగిలిన 5 శాతం అగ్రవర్ష పేదలకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. కానీ, అది అమలు కాలేదు. ఇక, పాదయాత్రలో భాగంగా జగన్ కాపులను బీసీల్లో చేర్చే అంశంపైన తేల్చి చెప్పేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు విధి విధానాలు ఖరారు చేసారు. కొంత కాలంగా మౌనంగా ఉంటూ...అప్పుడప్పుడూ బహిరంగ లేఖలు రాస్తున్న ముద్రగడ ఇప్పుడు కొంత మంది ముఖ్యులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మెజార్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా కొత్తగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా ఈ కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీలు..దళితులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పార్టీ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం దళిత.. బీసీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు సైతం దీనిని నిర్ధారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని..మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇది పూర్తయి ..రాజకీయ పార్టీగా ఏర్పడితే జరిగే ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందనే చర్చ  మొదలైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)