మట్టి లేకుండా కూరగాయల సాగు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 December 2021

మట్టి లేకుండా కూరగాయల సాగు


మట్టి లేకుండా కేవలం నీటిలోనే పంటలను పండించే ఈ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీ ఇపుడు చాలా చవకగా కనిపిస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరిగే ఆర్గానిక్ కూరలను తీసుకోవడం, ఇంకా ఇంట్లోని బాల్కనీలో లేదా టెర్రస్ మీద సొంతంగా కూరగాయలు పెంచడం, కోవిడ్ తరువాత నుంచి హైదరాబాద్ ప్రజల్లో అలవాటుగా మారింది. ఇలాంటి కూరగాయలు, ఆకు కూరలకు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రత్యేక పాలీహౌస్ లో పంటలను పెంచుతున్నారు. హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. మొదటగా సీడ్‌ ట్రాక్‌ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాలను మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ సిస్టమ్లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు. ఎక్కువ మోతాదులో మట్టి అవసరం లేకుండా వాటిలో రాళ్లు నింపి ప్రత్యేక పద్దతులు అవలంభిస్తారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో ద్రావణాలు అందించి వాటిని పెంచుతారు. దీని ద్వారా ఆర్గానిక్ ఆకుకూరలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్.ఓ వాటర్ ఎల్లప్పుడూ ఫ్లో అయ్యేటట్టు ప్రత్యేక పైప్ లైన్ ను ఏర్పాటు చేసి, సెన్సార్ తో సహజ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. అలానే ఈ మొక్కలకు ఎక్కువగా వేడి తగలకుండా ప్రత్యేక ఛానల్‌ను ఏర్పాటు చేసే టెంపరేచర్ ని తగ్గిస్తారు… కేవలం మొక్కకి కావలసిన విటమిన్స్, మినరల్స్ నీళ్లలో కలిపి ఆ నీటిని వాడుతారు… ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ వల్ల ఎన్నో రకాల కూరగాయలను తక్కువ సమయంలో ఎక్కువ లాభం తో పండించవచ్చు… అది మాత్రమే కాకుండా మన లోకల్ ఆకుకూరలతో పాటు దేశీ విదేశీ కూరగాయలను కూడా పెంచుతారు…ఇకపోతే, ఈ హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ కోసం ప్రభుత్వం కూడా సహకరించి సబ్సిడీని అందిస్తుంది. నీటిలోనే ఉన్న ఆక్సిజన్ ఇంకా మినరల్స్ వల్ల ఆకుకూరలు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆరోగ్యంగా తక్కువ సమయంలోనే పెరుగుతుంది.. మొక్కలు నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది. పంట కోత అయిపోయిన తర్వాత నీటిని వేస్ట్ చేయకుండా ఈ నీటిని వేరే మొక్కలకి వాడుతారు. ఈ మధ్య ఈ కాలంలో ఎక్కువ అపార్ట్‌మెంట్స్‌లో ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అనేది బాగా వినిపిస్తోంది.. ఎవరి ఇంట్లో వాళ్లు సొంతంగా ఆకుకూరలను ఎలాంటి కెమికల్స్ పండించుకుంటున్నారు. హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ అనేది ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్‌ చేస్తోంది.

No comments:

Post a Comment