శబరిమలకు అయ్యప్ప భక్తుల పరిమితి పెంపు !

Telugu Lo Computer
0


అయ్యప్ప భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) ఆదివారం తెలిపింది. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు దేవస్వం మంత్రి కార్యాలయం తెలియజేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘నెయ్యభిషేకం’  చేసేందుకు భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ – కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని గతవారం వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు (డిసెంబర్ 17న) రేపు సికింద్రాబాద్ నుంచి కొల్లం స్టేషన్‌కు (07109) బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్‌ (07110) కు డిసెంబర్ 19న స్పెషల్ రైలు బయల్దేరుతుందని పేర్కొంది. అయితే.. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్‌, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్‌చెరి, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)