కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1.50 శాతానికి పైగా పతనాన్ని చూశాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 1070 పాయింట్లు కుంగి 55,940 వద్ద, నిఫ్టీ 327 పాయింట్ల నష్టంతో 16,657 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉండటంతో మదుపరులకు చుక్కలు కనిపించాయి. అత్యధికంగా రియాల్టీ రంగం 3.45శాతం, లోహ రంగం 3.10శాతం నష్టపోయాయి. బ్యాంక్, ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ సహా అన్ని రంగాల పతనం కారణంగా ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1150 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 16,700 దిగువకు పడిపోయింది. హెవీ వెయిట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బలహీనత కారణంగా మార్కెట్ ఒత్తిడిలో ఉంది. స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ఆసియా ప్రధాన మార్కెట్లు కూడా నేడు నష్టాల్లోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)