ఇక పోస్టాఫీస్ ల బాదుడు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 December 2021

ఇక పోస్టాఫీస్ ల బాదుడు...!


జనవరి 1 నుంచి బ్యాంకు లావీదేవీల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అన్ని బ్యాంకులు ధరలు పెంచినా ఇండియన్‌ పోస్ట్ పేమెంట్‌ ఎప్పుడూ పెంచలేదు. ఈ దపా ఈ బ్యాంకు కూడా వీటి లిస్టులో చేరిపోయింది. సామాన్యుల దగ్గర ఫైన్‌ వసూలు చేసేందుకు సిద్దమైంది. జనవరి 1, 2022 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తన సేవల కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించడం ప్రారంభిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రాథమిక సేవింగ్స్ ఖాతా నుంచి ప్రతి నెల గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి విత్‌డ్రాపై  ఛార్జీ విధిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లోని సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా నుంచి ప్రతి నెలా 25 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఒక నెలలో గరిష్టంగా 25 వేల రూపాయలు విత్‌డ్రా చేస్తే ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పరిమితి దాటిన తర్వాత ప్రతి విత్‌డ్రాపై రూ. 25 వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీపై జీఎస్టీని ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఏటిఎం  ఉపసంహరణ, ఆర్ టి జి ఎస్ , నిఫ్ట్, ఆన్‌లైన్ బదిలీ, ఇఎంఐ  లావాదేవీ ఏవైనా సరే ఛార్జీ చెల్లించాల్సిందే. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం మాత్రమే కాదు ఖాతాలో డబ్బు జమ చేసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అవును ఇండియా పోస్ట్ ఖాతాదారులు నెలలో 10 వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయగలరు. రూ.10,000 పరిమితి దాటిన తర్వాత ఒక్కో డిపాజిట్‌పై రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పరిమితి దాటిన తర్వాత ఛార్జ్‌పై జీఎస్టీ కూడా విధిస్తారు. ఒకవేళ మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లయితే డబ్బును డిపాజిట్ చేయడం, విత్‌ డ్రా చేయడం అవసరమున్నప్పుడే చేయండి. 

No comments:

Post a Comment