గుంటూరులో రేవంత్ నిశ్చితార్థం !

Telugu Lo Computer
0


తన వాయిస్‌తో తెలుగులో ఎన్నో మంచి సాంగ్స్ పాడి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్న గాయకుడు  రేవంత్. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గుంటూరులో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రేవంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రేవంత్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్  పూర్తి పేరు లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. అతని స్వస్థలం శ్రీకాకుళం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసాడు. కెరీర్ స్టార్టింగ్‌లో పలు సింగింగ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపెట్ చేసి విన్నర్‌గా నిలిచిన రేవంత్ తెలుగుతో పాటు కన్నడలోనూ సాంగ్స్ పాడాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)