లోన్ ఇస్తాం...పిల్లల్ని కనండి!

Telugu Lo Computer
0

 


జనాభా నియంత్రణ కోసం పిల్లల్ని కనొద్దంటూ కఠినంగా వ్యవహరించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుని  జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది. డబ్బులు ఇచ్చి మరీ పిల్లల్ని కనమంటోంది. కొన్నేళ్లుగా అక్కడ జనాభా పెరుగుదల రేటు తగ్గిపోయింది. భవిష్యత్తులో యువత శాతం భారీగా పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. దీంతో పిల్లలను కనండంటూ ప్రభుత్వం వెంటపడుతుంది. పిల్లల్ని కనడానికి లోన్లు కూడా అందిస్తుంది. జిలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలనుకునే వాళ్లకు రెండు లక్షల యువాన్‌లు (రూ.25 లక్షలు) అందిస్తోంది. దీనికోసం అక్కడ బ్యాంకులకు సపోర్ట్ చేయాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తోంది. అలాగే మ్యారేజ్, బేబీ లోన్‌లపై కట్టే వడ్డీల్లో భారీగా డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది. ఒక వేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పన్నులో మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)