పోలీసులకు చిక్కాన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో మంగళవారం సాయంత్రం కారులో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఎస్సైలు సుధాకర్‌, శైలజ తమ సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మెహిదీపట్నం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన హార్మోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ జమీర్‌ సిద్ధిఖ్‌ (28), హఫీజ్‌పేట్‌ గోపాల్‌నగర్‌లోని శ్రీ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పులి రమ్య(32), అల్మాస్‌గూడ శేషాద్రినగర్‌లో నివాసముంటున్న కౌకుంట్ల అఖిల్‌ (31)గా గుర్తించారు. వారి వద్ద నుంచి వివిధ రకాల 9.4 గ్రాముల డ్రగ్స్‌తో పాటు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు పేర్కొన్నారు. ఈ ముగ్గురు 'క్లబ్‌ హౌస్‌' అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారు. యాప్‌లో డ్రగ్స్‌ గురించి చర్చించేవారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో తరచూ కలుసుకునే వారు. కౌకుంట్ల అఖిల్‌ గోవా వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి వచ్చేవాడు. దాన్ని మిగతా ఇద్దరికి ఇచ్చేవాడు. డిసెంబరు 31 రాత్రి వేడుకలు చేసుకునేందుకు జమీర్‌ సిద్ధిఖ్‌, పులి రమ్య ఈ నెల 9న గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొన్నారు. మంగళవారం అఖిల్‌కు డ్రగ్స్‌ ఇస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)