బాపు పేరు వాడుకొని ఎదగాలనుకోవడం లేదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 December 2021

బాపు పేరు వాడుకొని ఎదగాలనుకోవడం లేదు


స్టార్ డైరెక్టర్ బాపు గారి మనవరాలు అయి ఉండి కూడా ఆయన పేరు ఉపయోగించుకోకుండా కేవలం టాలెంట్ తోనే మొదట యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న నటి గాయత్రి భార్గవి. మొదటి నుండి సినిమాలు అంటే ఇష్టంతో చదువు కంప్లీట్ అయ్యాక యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి పాత్రలతో ఇప్పటికి మనలని అలరిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన కరోనా వైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన నటంతో మెప్పించ్చింది. సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉన్నా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదట. సొంత టాలెంట్ తోనే సెటిల్ అవ్వాలని అనుకున్నారట. ఇక అలా కష్ట పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ పేరు తెచ్చుకోవడం అంటేనే ఆమెకు ఇష్టమట. బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వం అని భావించాను అని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు గాయత్రి. స్వయంకృషితో పెరిగితే అందులో ఉండే తృప్తి మరోదానిలో ఉండదు అని గాయత్రి భార్గవి ఎప్పుడు చెప్పుతుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రి తన కెరియర్ లో జరిగిన అనుభవాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఓ యాడ్ ఫిలింస్ చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల్లోకి రావడం వాళ్ళ ఫ్యామిలీకి అసలిష్టం లేదట. సినిమాలు వద్దు అని ఎన్ని సార్లు చెప్పిన వినకపోవడంతో తనకి చిన్న వయసులోనే పెళ్లి చేశారట. 21 ఏళ్లలోనే తనకు పిల్లలు పుట్టారట. ఆ తర్వాత తన భర్త ఆమె కల ను గుర్తించి సినిమాలు చేయమని చెప్పడంతో మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించాను అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చారు.


No comments:

Post a Comment