ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్

Telugu Lo Computer
0


ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3గం. సమయంలో ఓ మహిళ (34) గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. సమీపంలోని బంధువుల ఇంటి వద్ద దింపాలని కోరింది. దీంతో అతను ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కారులో అప్పటికే అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసుల తెలిపారు. సాగర్‌పూర్ నుంచి నిహల్ విహార్ ప్రాంతం వైపు వెళ్లిన ఆ కారు.. అక్కడికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది. అక్కడే ఇద్దరు కలిసి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఐపీసీ సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్) కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు నిందితుల్లో ఒకరి బర్త్ డే అని ఆరోజు ఇద్దరు బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగితేలారని చెప్పారు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదును స్వీకరించేందుకు స్థానిక పోలీసులు మొదట నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను వారు ఖండించారు. ఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొనడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు కాస్త సమయం పట్టిందని పోలీసులు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)