కాల్షియం లోపం - ఆహార నియమాలు !

Telugu Lo Computer
0


మానవశరీరానికి అత్యవసరమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాల పెరుగుదల్లో దీనిదే కీలక పాత్ర. ఇది లోపిస్తే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రావచ్చు. దీనివల్ల ఎముకలు గుల్లబారిపోయి, ఎముకలు బలహీనంగా మారి ఏ బరువును మోయలేరు. అంతేకాదు ఎముకల నొప్పులు కూడా భరించలేరు. హైబీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లల్లో ఈ లోపం తలెత్తితే ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి కాల్షియం రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. కాల్షియం లోపం పెద్దల్లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. వీరిలో కండరాలు పట్టినట్టు అయిపోతాయి. కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువవుతాయి. చిన్నపనికే అలసటగా అనిపిస్తుంది. కాళ్ల కింద సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. బరువైన వస్తువులను ఎత్తలేరు. ఏ వస్తువును ఎక్కువసేపు పట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలు కనిపిస్ వెంటనే తే వైద్యులను సంప్రదించడం మేలు. గోధుమలతో రోజూ ఒక పూట చపాతి చేసుకుని తినాలి. అది కూడా బంగాళాదుంప కూరతో పాటూ తినాలి. ఎందుకంటే గోధుమలు, బంగాళాదుంప రెండింటిలోనూ కాల్షియం ఉంటుంది. అధికంగా కావాలంటే రోజూ బాదం పప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటివి ఓ గుప్పెడు తినాలి. బెల్లంలో ఐరన్ తో పాటూ కాల్షియం కూడా లభిస్తుంది. పాలు, పెరుగు కాల్షియానికి మంచి మూలాలు. కొత్తిమీర, మెంతులు వంటి ఆకుకూరల్లో కూడా ఈ పోషకం పుష్కలంగా ఉంటుంది. సోయా చంక్స్, రాగులు, మినుములు, పుదీనా, ధనియాలు, చేపలు, కోడి గుడ్లు, కొబ్బరి, చిలగడదుంపలు, కాలీ ఫ్లవర్ వంటి వాటిలో కూడా కాల్షియం లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)