గోల్డ్‌మ్యాన్‌ స్యాక్స్‌లో గర్భస్రావ సెలవులు

Telugu Lo Computer
0


కొన్నికారణాల వల్ల గర్భస్రావం జరుగుతుంది. ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి మహిళలకు కొంత సమయం పడుతుంది. ఆ విషయాన్ని గుర్తించి తమ ఉద్యోగులకు ఇరవై రోజులపాటు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు ప్రకటించింది అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ స్యాక్స్‌. సరోగసి ద్వారా గర్భం ధరించే వారికి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఆ సంస్థ ఇప్పటికే, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇరవై రోజులు, దగ్గరి బంధువు చనిపోతే అయిదు రోజులు, కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే నాలుగు వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)