దూసుకొస్తున్న జవాద్‌

Telugu Lo Computer
0


అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం  తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిషా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 4వ తేదీ  ఉదయం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒరిస్సా తీరానికి తుపాను చేరువవుతుంది. తీరానికి చేరువైనా భూమ్మీదకు రాకుండా ఉత్తర, తూర్పు దిశగా (ఒడిషా తీరం మీదుగా) పశ్చిమ్‌ బెంగాల్ కు చేరుకునే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. 3న గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు. 4న గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగఢ్, జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, కటక్, భద్రక్, బాలేశ్వర్, జాజ్‌పూర్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'ఆరెంజ్‌' హెచ్చరికలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)