ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయండి : అమిత్‌షా

Telugu Lo Computer
0


ఫిక్కీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి శుక్రవారంనాడు మాట్లాడుతూ నిరుద్యోగం  వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, మైక్రో, స్మాల్, మీడియం ఎంట్రప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లపై ప్రత్యేక దృష్టి సారించడం అవసరముందన్నారు. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేమని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశం ఎప్పుడూ సక్రమంగానే ఉంటుందనడానికి గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడమే నిదర్శనమని చెప్పారు. గత ఏడేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చినట్టు విమర్శకులు కూడా ఒప్పుకుంటున్నారని, తమ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వం అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని, అవి దేశ వృద్ధి, అభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపించాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వృద్ధి చెందిన దేశంగా ఇండియా నిలవనుందని అన్నారు. దేశ అభివృద్ధి రెండంకెల స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)