తెల్లత్రాచు హల్‌చల్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన తెల్లత్రాచు పాము హల్‌చల్‌ చేసింది. ముమ్మిడివరంలోని ఓ కొబ్బరి తోటలో ఈ తెల్ల త్రాచుపాము కలకలం రేపింది. కొబ్బరికాయల మధ్య దాగివున్న భారీ తెల్ల త్రాచుపాము బుసకొడుతూ స్థానికులు, కార్మికుల్ని హడలెత్తించింది. కొబ్బరి ఒలుపు కార్మికులు కొబ్బరి రాశి నాడెం వేస్తుండగా బుసలు కొడుతూ భారీ తెల్ల త్రాచు పాము కంటపడింది. దీంతో బెంబేలెత్తిపోయిన కార్మికులు యజమాని సమాచారం అందించారు. కొబ్బరి తోట యజమాని వెంటనే స్నేక్ క్యాచర్ వర్మ కు సమాచారం అందించారు.. కొబ్బరి రాశి లో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ.

Post a Comment

0Comments

Post a Comment (0)