సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రారంభం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు వారి ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకొచ్చిన తరువాత అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గ్రామ, వార్డుల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఇందు కోసం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించారు. ఈ వ్యవస్థ అందుబాటు లోకి తీసుకొచ్చిన తరువాత మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రోబేషన్ డిక్లరేషన్ అయిన తరువాత ఆ ఉద్యోగులకె సైతం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రయోజనాలు కల్పించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా.. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఈ ఉత్తర్వుల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులను కలిసి కోరారు. తొలిగా విశాఖ జిల్లాలోని వి. మాడుగుల, దేవరాపల్లి, రావికమతం మండలాల పరిధిలోని దాదాపు 30 మంది వెల్ఫేర్ అసిస్టెంట్ ల ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి విషయంలోనే ప్రభుత్వ అధికారులు ఈ మధ్య కాలంలోనే కీలక సిఫార్సులు చేసారు. వార్డు - గ్రామ సచివాలయ ఉద్యోగులకు సైతం పీఆర్సీ అమలు చేయాలని సీఎస్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే, ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా.. వారు ప్రభుత్వ ఉద్యోగులుగా పీఆర్సీకి అనుమతికి అవకాశం ఉండదు.

Post a Comment

0Comments

Post a Comment (0)