విడాకులు తీసుకున్నమ్యూజిక్‌ డైరెక్టర్‌

Telugu Lo Computer
0

సినిమా పరిశ్రమలో ఈ ఏడాది మరో జంట విడిపోయింది. తమిళ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమ్మాన్‌ తన సతీమణి మోనికా రిచర్డ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికీ సమంత, నాగచైతన్యలు విడాకుల వ్యవహారంపై చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇమాన్‌ తన 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ జంట గతేడాది నవంబర్‌లోనే విడాకులు తీసుకుంది. అయితే ఇద్దరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన విడాకుల విషయాన్ని వెల్లడించాడు ఇమ్మాన్‌. 'ఇన్నేళ్లుగా మాపై ప్రేమాభిమానాలు, మద్దతు చూపిస్తున్న శ్రేయోభిలాషులకు, సంగీత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలం కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా సహకరిస్తున్నారని ఆశిస్తున్నాం. అదేవిధంగా జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలకు మరోసారి ధన్యవాదాలు' సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు ఇమ్మాన్‌. ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా పనిచేసే మోనికాని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. అయితే అనూహ్యంగా 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ అందరికి షాకిచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 2002లో విజయ్‌, ప్రియాంక చోప్రా జంటగా నటించిన 'తమిజన్‌ చిత్రంతో' సంగీత దర్శకుడిగా మారాడు ఇమ్మాన్‌ . పలు హిట్‌ సినిమాలకు బాణీలు సమకూర్చారు. విజయ్‌తో పాటు విక్రమ్, అజిత్‌, ఆర్య, ధనుష్‌, విజయ్ సేతుపతి, జయం రవి తదితర స్టార్‌ హీరోల సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అజిత్‌ హీరోగా నటించిన 'విశ్వాసం' చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక ఇటీవల రజనీకాంత్‌ హీరోగా నటించిన 'అన్నాత్తే(తెలుగులో పెద్దన్న)' సినిమాకు సంగీతం అందించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)