అభిమానులపై మంగ్లీ సీరియస్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. మంత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఒక్కసారిగా ఫోటోల కోసం ఫ్యాన్స్‌ హంగామా చేయడంతో తట్టుకోలేక అటూ ఇటూ పరుగులు పెట్టింది మంగ్లీ. అక్కడ యువకుల తీరుతో ఇబ్బంది పడింది. ఇదేం పద్దతి అంటూ మండిపండింది. ఫోనులు పగలకొట్టండి అంటూ సీరియస్ అయింది. షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అభిమానుల నుంచి ఈ సెల్ఫీల తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానానికి కూడా ఓ పద్ధతి ఉంటుందని, కానీ సెల్ఫీల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని గతంలో చాలామంది సెలెబ్రెటీలు కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)