మోదీ ట్విట్టర్​​ అకౌంట్ హ్యాక్​...!

Telugu Lo Computer
0


హ్యాకర్స్ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపై ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌ కావడం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. నరేంద్ర మోదీ ట్విట్టర్​​ అకౌంట్​ ను ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ ​ ఆధీనంలోకి తీసుకున్నారు . ఈ విషయాన్నిపీఎంవో తన ట్విట్టర్​​ హ్యాండిల్​ ద్వారా ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో తెలియజేసింది. హ్యాకింగ్​ విషయాన్ని ట్విటర్ కు తెలియజేశామని పీఎంవో పేర్కొంది. వెంటనే ట్విటర్​ ప్రధాన మంత్రి ఖాతాకు భద్రత కల్పించిందని తెలిపింది. అయితే హ్యాకర్స్​ నరేంద్ర మోదీ ట్విటర్​ అకౌంట్​ నుంచి ఓ పోస్టు పెట్టింది. ఆదివారం 2 గంటల ప్రాంతంలో ట్విటర్​లో నరేంద్రమోదీ ఖాతా నుంచి హ్యాకర్లు ఒక సందేశం పెట్టారు. బిట్​ కాయిన్​లను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని ఆ పోస్టులో తెలిపారు. అంతేకాకుండా బిట్​కాయిన్ల కోసం టెండర్లను ప్రభుత్వం పిలిచిందని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా 500 బిట్​ కాయిన్లు కొనుగోలు చేసిందని, దేశంలోని ప్రజలందరికీ బిట్​కాయిన్లు పంచబోతుందంటూ హ్యాకర్స్​ ప్రధానమంత్రి ట్విటర్​లో పోస్టు పెట్టడం సంచలనం రేకెత్తించింది. దీంతో అప్రమత్తమైన పీఎంవో తన ట్విట్టర్​​ హ్యాండిల్  లో.. " PM @narendramodi ట్విట్టర్ అకౌంట్​ హ్యాకింగ్​కు గురైందను ట్విట్టర్​​కు తెలియజేయడంతో వెంటనే మోదీ ఖాతాకు భద్రత కల్పించారు. ఖాతా హ్యాక్ అయిన ఆ సమయంలో ఏదైనా సందేశం వస్తే వదిలివేయండి" అని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)