తెలుగు బాగా నేర్చుకుని నటిస్తే బాగుంటుంది

Telugu Lo Computer
0


దేశ భాషలందు తెలుగు లెస్స.. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. అలాంటి తెలుగు భాష.. ఇప్పుడు నిరాదరణకు గురవుతోంది. ఇది ఎవరో తెలుగు పండితుడో.. లేక తెలుగు మాస్టారో చెప్తున్న మాట కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన ఇది. ఘంటసాల శతజయంతి వేడుకల సందర్భంగా తెలుగు సినీ నటీనటులకు క్లాస్ తీసుకున్నారు ఎన్వీ రమణ. తెలుగు భాషకు సంబంధించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. తెలుగు భాష ఉచ్ఛారణ బాగా నేర్చుకుని నటిస్తే బాగుంటుందని సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ టాలీవుడ్‌ నటులకు సూచించారు. గాయకులు కూడా తెలుగు సరిగా నేర్చుకుని పాడాలన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ కూడా తెలుగు రాకపోయినా, డ్యాన్స్‌ రాకపోయినా మద్రాస్‌లో కొన్ని నెలల పాటు ప్రాక్టీస్‌ చేశారని, తెలుగు రాకపోతే అవమానంగా భావించవద్దన్నారు. అలాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తెలుగు నేర్చుకునేలా ప్రోత్సహించాలని హైదరాబాద్‌లో జరిగిన ఘంటసాల శతజయంతి సభలో సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)