పులిపిర్లను వదిలించుకోవాలంటే ?

Telugu Lo Computer
0


ఇప్పుడు ఎక్కువగా అందరూ చర్మ సౌందర్య మీద దృష్టి పెడుతున్నారు. ఇక అలా ముఖం మీద ఎలాంటి చిన్నటి పింపుల్స్, గుల్లలు లేచిన అందుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అయితే వీటికి అయితే ట్రీట్మెంట్ ఉంది కానీ, పులిపిర్లు వంటికి ట్రీట్మెంట్ ఉందా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు తెలిపిన మేరకు వాటిని పూర్తిగా నివారించలేము.. కానీ అణిచివేయాగలమని తెలియజేశారు. ముందుగా మన వంటింట్లో దొరికేటువంటి వెల్లుల్లి పైన ఉండేటువంటి పొరను పులిపిరులపైన బాగా రుద్దాలి. ఎందుకంటే అందులో కొన్ని యాంటి వైరల్ అనే లక్షణాలు ఉంటాయి కనుక. ఇలా ఒక నెలలో కనీసం 3 వారాల పాటు  రుద్దడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఉల్లిపాయను సగ భాగం చేసి.. అందులో ఉండేటువంటి మధ్యభాగాన్ని తొలగించి.. రాళ్ల ఉప్పు తో దానిని నింపాలి. 5 నిమిషాల తర్వాత కలిసిపోయి ఒక మిశ్రమ ద్రావణం గా ఏర్పడతాయి. ఆ ద్రావణాన్ని తీసుకొని ఒక నెల రోజులపాటు పులిపిరులపైన పట్టించాలి. ఫ్రెష్ గా ఉండేటువంటి సున్నాన్ని.. పులిపిరులపైన మన రాస్తే వాటంతట అవే రాలిపోతాయి. అల్లం బాగా ఊరిన తర్వాత అందులో కి కొత్త సున్నాన్ని వేసి పులిపిరులపైన పట్టిస్తే అవి రాలిపోతాయి.  పులిపిర్ల మీద మాత్రమే రాయాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)