జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని మహేష్‌బాబు ఆకాంక్షించాడు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మహేష్ ట్వీట్ చేశాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)