డిసెంబర్ 31 లోపు ఈ-నామినేషన్ ఫైల్ చేయండి !

Telugu Lo Computer
0


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త రూల్ తీసుకొని వచ్చింది. డిసెంబర్ 31 లోపు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు నామినీ పేరును జత చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. నామినీ పేరును జత  చేయకపోతే, ఈ రిటైర్‌మెంట్ బాడీ అందించే పలు ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఈపీఎఫ్ అందించే ప్రయోజనాలను పొందాలంటే డిసెంబర్ 31 లోపల నామినీ పేరును తమ ఖాతాలకు జత చేసుకోవాలని, ఈ-నామినేషన్ ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌ చేసినట్లు పేర్కొంది.  ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేసి, యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. పాప్ అప్ మీద క్లిక్ చేయండి లేదా మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎ తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎ ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు యాడ్ చేయవచ్చు.వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎ ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎

Post a Comment

0Comments

Post a Comment (0)