రేషన్ కార్డుంటే పెట్రోల్ పై రూ. 25 తగ్గింపు

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ ముఖ్య మంత్రి హేమంత్‌ సోరేన్‌ ద్విచక్ర వాహనదా రులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని బుధవారం ప్రకటిం చారు. రేషన్‌కార్డు ఉన్న ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 రాయితీని ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. తన ప్రభుత్వం అధికారంలోకి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా రాంచీలోని మోర్హాబది మైదాన్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ హేమంత్‌ సోరెన్‌ ఈ విషయాన్ని ప్రకటిం చారు. రేషన్‌కార్డు ఉన్న ద్విచక్రవాహనదారులకు నెలకు 10 లీటర్ల వరకూ ఇంధన ధరపై ఈ తగ్గింపు అవకాశం ఉంటుందని చెప్పారు. సబ్సిడీ రూ 250ను నెలకు ఒకసారి లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్‌ ఖాతా ద్వారా చెల్లిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 62 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. జార్ఖండ్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ. 98.52గా ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)